జులైలో హోవర్‌ ట్యాక్సీని ప్రారంభించనున్న దుబాయ్‌...

- February 16, 2017 , by Maagulf
జులైలో హోవర్‌ ట్యాక్సీని ప్రారంభించనున్న దుబాయ్‌...

దుబాయ్‌: చైనీస్‌ ప్రోటోటైప్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ హోవర్‌ ట్యాక్సీని ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ప్రకటించింది. జులై నాటికి ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈ హోవర్‌ ట్యాక్సీ దూసుకుపోతుంది. ప్రయాణీకుడు తాను చేరాలనుకుంటున్న గమ్యాన్ని ఎంపిక చేసుకుని, హోవర్‌ ట్యాక్సీని టేకాఫ్‌ చేయవచ్చు. ఆ తర్వాత అది నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ గ్రౌండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించబడ్తుంది. 2 గంటలపాటు ఛార్జింగ్‌ చేస్తే, 30 నిమిషాలపాటు ప్రయాణిస్తుంది. ఇహాంగ్‌ సంస్థ ఈ చైనీస్‌ డ్రోన్‌ని తయారు చేసింది. 2030 నాటికి ఈ తరహా వాహనాల వినియోగం ఎక్కువగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్‌ ఇబ్బందులకు ఈ చైనీస్‌ డ్రోన్‌తో చెక్‌ పెట్టవచ్చు. ఎనిమిది ప్రొపెల్లర్స్‌తో ఈ క్వాడ్‌ కాప్టర్‌ పనిచేస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com