బహ్రేయినీ ఆసుపత్రిలో మరణిస్తున్న పసిపిల్లలు
- February 16, 2017
మనామా: బహ్రేయినీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో పసిపిల్లవాడు మరణించాడు. ఈ ఏడాదిలో ఇది ఐదవ మరణ కేసు కావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిన్నారుల మృతికి గల కారణాలు తెలుసుకొనేందుకు ఒక తక్షణ విచారణ జరిపేలా అధికారులకు సూచనలిస్తూ ప్రభుత్వం ఆదేశించింది.. రెద కమర్ అనే ఏడాది వయస్సు గల బాలుడు మంగళవారం సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లోని ప్రమాద మరియు అత్యవసర విభాగం చికిత్స తీసుకుంటూ మరణించినట్లు నివేదికలో వెల్లడైంది. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోవడంతో ఆ బాలుడు ఆసుపత్రి చిన్నారుల వార్డ్ లో చేరినట్లు తెలుస్తుంది, నివేదికల ప్రకారం, అతని ఆరోగ్య పరిస్థితి కొన్ని రోజుల తరువాత క్షీణించింది. దాంతో ఆ చిన్నారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో చేర్చారు. ఆ తరువాత ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ పిల్లల మరణం పట్ల ఒక తక్షణ విచారణ జరపాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి ఫారుఖ్త్ అల్ సాలెహ్ ఆదేశించారు. ఈ దురదృష్టకర సంఘటన యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకొనేందుకు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో సమగ్ర పరిశీలనకు ఒక బృందాన్ని పంపినట్లు మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







