202 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలు కల్గి ఉన్న వ్యక్తి దుబాయ్ లో అరెస్టు
- February 16, 2017
శిక్షలు ఎంత కఠినంగా అమలవుతున్నప్పటికే ...గల్ఫ్ దేశాలలో మాధకద్రవ్యాల వ్యాపారం విస్తరించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నాలు చేస్తూ పట్టుబడిపోతున్నారు... ఈ మాధకద్రవ్యాల విషయం అంత తీవ్రంగా తీసుకొని కొన్ని ఆసియా దేశాలలో ఈ విష వృక్షం వేళ్ళు ఎంత బలంగా పాతుకుపోయాయోనన్న అనుమానం కల్గుతుంది. ఓ అనుమానితుడు విమానాశ్రయానికి వెళ్లే ముందు పోలీసులు ఆ వ్యక్తి ఇంటిపై సోదాలు నిర్వహించగా 202 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. ' బ్యాక్ పాకర్ ' అనే ఒక కార్యకలాపంలో దుబాయ్ పోలీసులు మాదక పదార్థాలను జి సి సి దేశాలకు చెందిన నిందితుని వద్ద నుంచి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకొన్నారు. ఈ అక్రమ మాధకద్రవ్యాల కోసం మార్కెటింగ్ మరియు ప్రమోషన్ కోసం ఆ వ్యక్తి యుఎఇ పర్యటన చేపట్టాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ జీసీసీ జాతీయుడిని అరెస్టు చేశారు. ఆ నిందితుని నుంచి 202 కిలోల మాదక పదార్ధాలను స్వాధీనం చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.జనవరి 30 వ తేదీన న నిందితుని మాదకద్రవ్యాల వ్యాపార సంబంధిత కార్యకలాపాలు గురించి సమాచారం దుబాయ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ శాఖ అందుకున్ననేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు . 37 ఏళ్ల అనుమానితుడు నివాసితున్న ఒక బంగ్లాలో పలుమార్లు ఈ మాదక ద్రవ్యాలు నిల్వ చేయబడ్డాయి. మాదక మాత్రలు కల్గిన నిందితుని కారులో రహస్య అమరికలలో మాదక ద్రవ్యాలు దొరికేయి. ఆ నిందితుడు నివసిస్తున్న భవనంపై మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మాంసూరి , దుబాయ్ పోలీసులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మరియు నార్కోటిక్స్ వ్యతిరేక జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ కల్నల్ ఈద్ మహమ్మద్ థానీ హ్రబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా నాలుగు సూట్‌కేసులు మరియు ప్లాస్టిక్ సంచులలో ఒక గది లోపల, కాప్తగోన్ మాత్రలు కనుగొనబడ్డాయి. ఇవి 202 కిలోల బరువు కల్గి ఉన్నాయి. దీంతో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









