బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి..
- February 16, 2017
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం షోపియన్ జిల్లాలోని తుర్కువాంగం ప్రాంతంలో ఉన్న జమ్ము కశ్మీర్ బ్యాంకు బ్రాంచిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
నలుగురు ఉగ్రవాదులు తుపాకులు చూపి బ్యాంకు సిబ్బందిని బెదిరించి.. రూ.2 లక్షలకుపైగా నగదును దోచుకుని అక్కడ్నించి పారిపోయారు. బ్యాంకు సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషయం తెలియగానే భద్రత దళాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. గత నవంబర్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు కొన్ని చోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు.
గురువారం ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం బ్యాంకులోంచి బయటికొచ్చిన ఉగ్రవాదులు గాల్లోకి కొన్ని రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







