రోగన్ జోష్...
- February 16, 2017
కావలసినవి: ఒక కేజీ మటన్, ఒక కప్పు నెయ్యి, 4 లవంగాలు, మూడు ముప్పావు కప్పుల నీళ్లు, ఉప్పు రెండుంపావు టీ స్పూన్లు, ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి ముద్ద, 8 యాలకులు, పసుపు 5 టీ స్పూన్లు, వేయించిన ఉల్లిపాయల ముద్ద 2 టేబుల్ స్పూన్లు, 4 టీ స్పూన్ల కారం కలిపిన ఒక కప్పు నీళ్లు, అర టీ స్పూను కుంకుమ పువ్వును పొడి చేసి కలిపిన రెండు టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు, పావు టీ స్పూను మిరియాల పొడి.
ఎలా చేయాలి
బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. లవంగాలను చిటపటలాడే వరకు వేగించాలి. తర్వాత కిందికి దించి వాటిపై ఒక టేబుల్ స్పూను నీటిని చల్లి మూత పెట్టి పక్కన పెట్టాలి. మాంసాన్ని నీటిలో ఉడికించాలి. పైన పేరుకున్న కొవ్వును ఎప్పటికప్పుడు తీసివేస్తూ నీళ్లు మామూలుగా అయ్యే వరకు ఉడికించాలి. దానికి ఉప్పు వెల్లుల్లి ముద్దను కలపాలి. సగం ఉడికిన తర్వాత మాంసం ముక్కలను బయటకు తీసి చన్నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోవాలి. మాంసం ఉడికించిన నీళ్లను వేరే గిన్నెలోకి వడకట్టాలి. ఆ గిన్నెను వేడి చేయాలి. దానిలో యాలకులు, పసుపు, లవంగాలు-నేతి మిశ్రమం, ఉల్లి ముద్దను వేసి బాగా కలపాలి. 10 నిముషాల పాటు ఉడికాక ఈ మిశ్రమంలో మాంసం ముక్కలను, కారం నీళ్లను వేసి సన్నని మంటపై ఉడికించాలి. మాంసం పూర్తిగా ఉడికిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కలిపిన నీళ్లు, మిరియాల పొడి కలపాలి. తర్వాత కొద్ది సేపు ఉడికించి కిందికి దించాలి. దీనిని వేడి వేడిగా వడ్డించాలి. హోటళ్లలో తినేవారికి ఇది చాలా ఫేవరెట్ డిష్.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







