వలసలపై వచ్చేవారం ట్రంప్ మరో ఉత్తర్వు...
- February 16, 2017
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులకు సంబంధించి వచ్చే వారంలోగా మరో కార్యనిర్వహక ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వలసదారులు, శరణార్థులకు సంబంధించి కొత్తగా ఉత్తర్వులు జారీ చేసేంతవరకు గతంలో ఇచ్చిన ‘ప్రయాణ నిషేధ’ ఉత్తర్వులను కొనసాగించాలని అమెరికా న్యాయ విభాగం న్యాయవాదులు ఫెడరల్ అప్పీల్స్ కోర్టును కోరారు. ఏడు ముస్లిం దేశాల పౌరులపై ట్రంప్ ఇటీవల జారీచేసిన ‘ప్రయాణ నిషేధ’ ఉత్తర్వులను కోర్టు నిలిపేయడంతో ఆయా దేశాల నుంచి అమెరికాకు ప్రయాణాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం కొత్తగా మళ్లీ కార్యనిర్వహక ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమైంది.
అమెరికాను రక్షించుకోవడానికి కొత్త ఆదేశాలు జారీ చేస్తానని గురువారం అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఉత్తర్వులతో అమెరికాలోకి ప్రవేశించే వారిని అత్యంత క్షుణ్ణంగా పరిశీలించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. గతంలో ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వుల్లో మార్పులు చేసి, చట్ట వ్యతిరేకమైన నిబంధనలను తొలగించి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







