గుండెపోటుతో దుబాయ్ రాజకుమారుని మృతి
- September 19, 2015
దుబాయ్ పరిపాలకుడు, యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారి కుమారుడు షేక్ రషీద్ బిన్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గుండెపోటుతో నేటి ఉదయం మరణించారు. జబీల్ మసీదులో అంతిమ ప్రార్ధనల అనంతరం వారి అంత్యక్రియలు బుర్ దుబాయ్ లోని ఉమ్మ్ హురైర్ శ్మశాన వాటికలో జరుగుతాయి.
దుబాయ్ పరిపాలకుని సభ ఐన అల్ దెవాన్, దుబాయ్ లో నేటినుండి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఎమిరేట్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పతాకాలు అవనతమై, సగం ఎత్తులో ఉంటాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







