'గణేష్ నిమజ్జనానికి రూ.4.7 కోట్లు' కేటాయింపు
- September 19, 2015
వినాయక చవితి నిమజ్జనానికి నీటిపారుదల శాఖ విభాగం తరఫున రూ.4 కోట్ల 70 లక్షలు ఖర్చు పెడతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి నిమజ్జనాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లో 33 క్రేనులు, చెరువుల వద్ద 21 క్రేనులు, నెక్లెస్ రోడ్డులో 48 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మిషన్ కాకతీయ పనులు ఈ ఏడాది పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. గణేశుడి దయతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ నిండాయని తెలిపారు. మరిన్ని వర్షాలు పడి మరిన్ని చెరువులు నిండాలని గణేశుడని కోరుకుంటున్నాని చెప్పారు. గణేశుడి నిమజ్జనానికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







