ఏ.పి సియం గల్ఫ్ పర్యటన ఖరారు

- February 18, 2017 , by Maagulf
ఏ.పి సియం గల్ఫ్ పర్యటన ఖరారు

నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆహ్వనించడం కొరకు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు గల్ఫ్ దేశాలలో పర్యటించనున్నారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల నుండి తాజా సమాచారం. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలను  రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంధ్ర సలహాదారు డాక్టర్ వేమూరు రవి కుమార్ కువైట్ లోని ఎపి ఎన్నార్టీ కో ఆర్డినేటర్లతో టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించనున్నారని అభిజ్ఞవర్గాలు సూచిస్తున్నారు.  ప్రాథమిక సమాచారం ప్రకారం,ఏప్రిల్ 2, 3 4 తేదీలలో చంద్రబాబు నాయుడు దుబాయి, ఆబుధాబి మరియు కువైట్‌లలో పర్యటించనున్నారు, ఈ మూడు నగరాలలో కూడ చంద్రబాబు నాయుడు ఆయన వెంట రానున్న ఉన్నత స్ధాయి అధికారిక బృందం గల్ఫ్ అరబ్ వ్యాపారవేత్తలతో సమావేశం జరపనుంది. ఈ మూడు చోట్లకు చెందిన స్ధానిక ప్రవాస మరియు కొందరు అరబ్బు వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి గత కొంత కాలంగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

తన పర్యటన సందర్భంగా అల్ మోఖ్తుం, అల్ నహ్యాన్ మరియు అల్ సభా మూడు రాజ కుటుంబీకుల ప్రతినిధులతో కూడ సమావేశం కావడానికి ముఖ్యమంత్రి ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లుగా సమాచారం.తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంధ్రుల సంక్షేమానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకోనున్న కొన్ని ముఖ్య ప్రకటనలు కూడ చేస్తారని భావిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు పార్టీ అభిమానులు నిర్వహించె కొన్ని కార్యక్రమాలలో కూడ పాల్గోంటారని సమాచారం. ముఖ్యమంత్రి రాక కొరకు కువైట్ లో తెలుగు ప్రజలు అతృతతో ఎదురు చూస్తున్నారు, ఆయన పర్యటన అంటూ జరిగితే కువైట్ లోని తెలుగు ప్రజలకి పండగే.... ఎన్నో తీపి కబుర్లు తీసుకువస్తారని ఆశిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com