'ఎయిర్‌ ఏషియా' వారి సరికొత్త ఆఫర్‌

- February 18, 2017 , by Maagulf
'ఎయిర్‌ ఏషియా' వారి సరికొత్త ఆఫర్‌

విమాన ప్రయాణీకుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా ఇండియా సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,099కే విమాన టికెట్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 19 వరకూ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ 30, 2017 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ప్రకటించింది. గువహటి-ఇంఫాల్‌ మధ్య ప్రయాణించే వారికి మాత్రమే రూ.1,099కి టికెట్‌ లభించనుంది. కోచి-బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్‌ల మధ్య రూ.1,449, గోవా-బెంగళూరు రూ.1,599, విశాఖపట్నం-బెంగళూరు రూ.1,699లుగా టికెట్‌ ధరలు ఉన్నాయి. అయితే ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయో సంస్థ వెల్లడించలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com