యుఏఈ లో మరో ప్రాంతంలో చెల్లించే పార్కింగ్ జోన్

- February 18, 2017 , by Maagulf
యుఏఈ లో మరో ప్రాంతంలో చెల్లించే పార్కింగ్ జోన్

షార్జాలోని అల్ మజాజ్ ప్రాంతంలో మూడవ శనివారం నుండి ఒక ప్రీపెయిడ్ పార్కింగ్ జోన్ ఉంటుందని  షార్జా మున్సిపాలిటీ ప్రజా పార్కింగ్ డైరెక్టర్ అతీఫ్ అల్ జరౌని తెలిపారు. కొత్త ప్రాంతాలలో నివాసితులు నివసించే ప్రాంతాలలో సందర్శకులు మరియు వాహన యజమానులు పార్కింగ్ ను దుర్వినియోగం చేయకుండా  నివారించడం కోసం పార్కింగ్ అందించడానికి ఈ  ప్రీపెయిడ్ పార్కింగ్ జోన్ జతచేయబడిందని ఆయన చెప్పారు.పార్కింగ్ మీటర్ల పరికరాలు ఇప్పుడు అరబ్ క్లబ్ వీధి, హసన్ బిన్ థాబిట్ వీధి, మూడవ వీధి లో వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సాల్మా బిన్ ఆఖ్వాహ్ మసీదు ముందు లో సైతం వీటిని అమర్చుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ చెల్లింపు పార్కింగ్ ను  ప్రారంభించడానికి ప్రధాన కారణం ప్రజలు చెల్లించిన రుసుముతో పార్కింగ్ ఆవశ్యకతలను మరియు మెరుగైన సేవలు అందించే నిమ్మిత్తం అని ఆయన అన్నాడు.పురపాలక పార్కింగ్ స్థలం లేదనే సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఈ ఏర్పాటు చేసినట్లు అల్ జాబుని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com