'రోగ్' సినిమా హీరోయిన్స్ డబుల్ ధమాకా
- February 18, 2017
రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమాలను రూపొందించే డాషింగ్ దర్శకుడు పూరిజగన్నాథ్ ఇప్పుడు మరో డిఫరెంట్ ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ కథానాయకుడు ఇషాన్‌ను పరిచయం చేస్తూ తన్వి ఫిలింస్ పతాకంపై రోగ్ (మరో చంటిగాడి ప్రేమకథ) సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అనుష్క, అసిన్, హన్సిక, రక్షిత, దిశా పటానీ, కంగనా రనౌత్, శియా, నేహాశర్మ, సమీక్ష, అయేషా టాకియా, అదాశర్మ లాంటి గ్లామరస్ కథానాయికన్లు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన పూరి ఈ సినిమాలో మరో ఇద్దరు భామలను పరిచయం చేయబోతున్నారు.
రోగ్ సినిమాలో ఇషాన్ సరసన మన్నారా చోప్రా, ఏంజెలాలు నటిస్తున్నారు. తన ప్రతి సినిమాలోనూ హీరోయిన్లను ఎంతో గ్రామర్‌గా చూపించే పూరి ఈ సినిమాలో కాస్త డోస్ పెంచనున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కన్నడంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









