ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు ' డ్రాఫ్ట్ లా ' ఖతార్ ఆమోదిస్తుంది
- February 18, 2017
ఖతార్: ఇళ్లల్లో పనిచేసే వేలాదిమంది దేశీయ మహిళా కార్మికులకు చట్టపరమైన భద్రత అందించే దిశగా తొలిసారిగా ఒక " డ్రాఫ్ట్ లా " ని ఖతార్ ఆమోదించిందని రాష్ట్ర మీడియా తెలిపింది. ఈ చట్టం ప్రకారం దేశీయ కార్మికులు తదితర సిబ్బంది రోజుకి ఎన్నిగంటలు పని చేయాలో తదితర విషయాలు వివరించడమే కాక, డ్రైవర్లు మరియు తోటలలో పనిచేసే సిబ్బంది వారానికి ఎంత పనిచేయాలనేది, అలాగే వారు ఏడాదికి ఎన్ని రోజులు సెలవు తీసుకోవాలనేది ఇందులో వివరిస్తారని భావిస్తున్నారు.ఈ చట్టంను కేబినెట్ అంగీకరించిందని బుధవారం తెల్సింది. ప్రాయోజికులు (స్పాన్సర్స్) మరియు దేశీయ సహాయకుల (డొమెస్టిక్ వర్కర్స్) కు ఈ చట్టం వర్తిస్తుంది, వారికి చెందిన హక్కులు మరియు విధులను ఇందులో పేర్కొంటుంది మరియు వారి మధ్య ఉన్న సంబంధంని నియంత్రిస్తుందని పేర్కొన్నారు. 84,000 మంది మహిళలలో ఎక్కువగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా నుండి కతర్ లో వలస దేశీయ కార్మికులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో అత్యధికులు నిర్బంధిత కార్మికులుగా తీవ్ర దోపిడీకి గురవుతున్నారని వారిపై భౌతిక దాడులు మరియు లైంగిక హింసతో వేధింపులకు గురవుతున్నారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2014 నివేదికలో ఆరోపించారు.ఫుట్ బాల్ ప్రపంచ కప్ 2022 లో ఆతిధ్యమిస్తున్న వేళ మానవ హక్కులు అమలుజరగడం లేదనే విమర్శా వినవస్తుంది. ఫుట్బాల్ యొక్క అతిపెద్ద టోర్నీకి స్టేడియంలలో మరియు మౌలిక నిర్మాణానికి సహాయం చేస్తున్న కార్మికుల హక్కుల అమలకు అనేక కీలక సంస్కరణలు ప్రకటించింది, అయితే దేశీయ సిబ్బంది హక్కుల చట్టం ద్వారా రక్షించబడలేదు .డ్రాఫ్ట్ చట్టం అమలకు సంబంధించి ప్రారంభలోనే అనుకూలంగానే ప్రతిస్పందన వస్తుంది. వలసవచ్చినవారి హక్కుల సంస్కరణలను గూర్చి సోషల్ మీడియాలో ప్రచారం సమూహంకు ఇదో "మంచి వార్త " గా మారింది. దేశంలో ఉన్న విస్తారమైన కార్మికులకై వలస శ్రామిక వేతన విధానంనిర్ధారించడానికి 2015 లో పరిచయం చేయబడిన వేతన రక్షణ వ్యవస్థ ని దేశీయ సిబ్బందికి కూడా కతర్ అమలుచేయాలని పిలుపునిచ్చారు. దీని ప్రకారం వారు సమయానికి జీతాలు అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ సమస్యలను పరిశీలించే అమ్నెస్టీ డిప్యూటీ డైరెక్టర్ జేమ్స్ లించ్ మాట్లాడుతూ, ప్రతిపాదిత చట్టం వివరాలను చూడడానికి ఎంతో ఆసక్తిగా వేచి ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశీయ కార్మికులకు ఒక చట్టం రూపొందిస్తున్నట్లు కతర్ ప్రభుత్వం ఎన్నోసంవత్సరాల నుంచి హామీ ఇస్తూనే ఉందని ఆ మంచి ముఖ్య విషయం కేవలం టేబుల్ ని మాత్రం దాటి వెలుపలకు రావడం లేదని ఆయన ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







