నేతి బీరకాయ బర్గర్
- February 18, 2017
కావలసిన పదార్థాలు: పావ్ బాజీ బన్స్ - 4, నేతిబీరకాయ - 1 (సన్నని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేయాలి), ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కొబ్బరి తురుము - 1 కప్పు, పసుపు - చిటికెడు, తాలింపు దినుసులు - తగినన్ని, పెసర మొలకలు - అరకప్పు, వేరుశనగ నూనె - 2 టీ స్పూన్లు, (పెప్పర్, సాల్ట్‌తో వేసిన) ఎగ్‌వైట్ ఆమ్లెట్ - రెండు ముక్కలు
తయారుచేసేవిధానం: నూనెలో తాలింపు వేశాక ఉల్లి, మిర్చి, నేతిబీర తరుగు వేగించాలి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించి పసుపు, ఉప్పు, కొబ్బరి తురుము కలిపి మరికొంత సేపు ఉంచి దించేముందు పెసర మొలకలు కలిపి దించేయాలి. బన్స్ లోపల కొంత భాగం తీసేసి, పెనంపై రెండు వైపులా కొద్ది క్షణాలు కాల్చి నేతిబీర మిశ్రమం కూరి ముక్కల మధ్యలో ఆమ్లెట్ పెట్టి బర్గర్ తయారుచేసుకోవాలి. పిల్లలు బాగా ఇష్టపడే స్నాక్ ఇది.8
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







