సత్యసాయి చరిత్ర
- February 20, 2017
పుట్టపర్తి సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'శ్రీసత్యసాయిబాబా'. సౌభాగ్య చిత్ర, ఎస్.సి.టి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరాటం రాంబాబు నిర్మాత. సత్యసాయిబాబాగా మలయాళ నటుడు శ్రీజిత విజయ్ నటిస్తున్నారు. ఆయనకి మాతృమూర్తిగా జయప్రద కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో భారీగా వేసిన ప్రశాంతి నిలయం సెట్లో ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మార్చి 10 వరకు ఇక్కడ షెడ్యూల్ జరుగుతుంది. కోడి రామకృష్ణ మాట్లాడుతూ ''సత్యసాయి జీవిత చరిత్రను చూపే అపురూపమైన చిత్రమిది. పుట్టపర్తిలో జరిగిన సంఘటనల్ని యధాతథంగా తెరకెక్కిస్తున్నాం.
ఇళయరాజా స్వరాలందించిన ఈ చిత్రానికి జొన్నవిత్తుల సింగిల్ కార్డ్‌లో 14 పాటలు రాశారు. రికార్డింగ్ పూర్తయింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ చివరిగా పనిచేసిన సినిమా ఇది'' అని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









