ఇక గంటల్లోనే పీఎఫ్ విత్ డ్రా
- February 20, 2017
ఉద్యోగుల పీఎఫ్ విత్ డ్రాయల్ ప్రక్రియ ఇక నుంచి గంటల వ్యవధిలోనే ముగియనుంది. క్లైయిమ్స్ సెటిల్ మెంట్ కోసం ఆన్ లైన్ ప్రక్రియను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ఆన్ లైన్ సౌకర్యం ద్వారా ఈపీఎఫ్ విత్ డ్రాయల్, పెన్షన్ స్థిరీకరణ వంటి అన్ని సదుపాయాలను కల్పించనుంది. పేపర్ వర్క్ కు స్వస్తి పలికి ఈపీఎఫ్ లను కూడా ఆన్ లైన్ చేయాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం ఈపీఎఫ్ విత్ డ్రాయల్ క్లైయిమ్ కోసం దాదాపు కోటి దరఖాస్తులు ఈపీఎఫ్ఓ ఆఫీసుకు వచ్చాయి. పీఎఫ్ విత్ డ్రా, పెన్షన్ స్థిరీకరణ,మరణించిన వారి ఇన్సూరెన్స్ లబ్ది వంటి దరఖాస్తులు దీనిలో ఉన్నాయి.
మొత్తం కార్యక్షేత్రాలను, సెంట్రల్ సర్వర్ తో అనుసంధించే ప్రక్రియ నడుస్తుందని, మే చివరి వరకు అన్ని దరఖాస్తులను, క్లైయిమ్స్ ను ఆన్ లైన్ లోనే నమోదు చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు. దరఖాస్తు నమోదుచేసిన కొన్ని గంటల్లోనే క్లైయిమ్స్ ను సెటిల్ చేసేలా ఈపీఎఫ్ఓ ఈ ఆన్ లైన్ ప్రక్రియను ప్రారంభిస్తుందని అధికారులు చెప్పారు. దీంతో ఇక ఈపీఎఫ్ విత్ డ్రాయల్ క్లైయిమ్ ప్రక్రియ మూడు గంటల్లోనే ముగియనుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 20 రోజుల వ్యవధి పడుతోంది. ఈ ఆన్ లైన్ ప్రక్రియ కోసం పెన్షనర్లు, సబ్ స్క్రైబర్లందరూ తప్పనిసరి ఈపీఎఫ్ఓ వద్ద తమ ఆధార్ నెంబర్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ సౌకర్యాన్ని వాడుకోవడానికి ఇది ఖాతాదారులకు ఎంతో సహకరించనుంది.
తాజా వార్తలు
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!







