పాక్‌లో వరుస బాంబు పేలుళ్లు!
- February 21, 2017
వరుస బాంబు పేలుళ్లతో పాకిస్థాన్ మరోసారి దద్దరిల్లింది. పాక్ వాయవ్య ప్రాంతంలోని చార్సద్దా జిల్లా తాంగి ప్రాంతంలో ఉన్న ఓ కోర్టు ఆవరణలో మంగళవారం వరుస మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పెద్దసంఖ్యలో పలువురు గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు కోర్టులో దాడికి ప్రయత్నించగా.. అందులో ఇద్దరిని పోలీసులు మట్టుబెట్టారు. మరొక సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో న్యాయవాదులు ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
ఇరుగుపొరుగుకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తున్న దేశంగా తరచు విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ గత వారమంతా వరస పేలుళ్లతో హోరెత్తిన సంగతి తెలిసిందే.
లాహోర్ మొదలుకొని బలూచిస్తాన్‌లోని ఆవారన్ వరకూ పలు నగరాలు, పట్టణాల్లో దాదాపు పది ఉగ్రవాద దాడులు జరిగి దాదాపు 50మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ పరాకాష్ట అనదగ్గ ఘటన గత గురువారం సింద్ రాష్ట్రంలోని సెహ్వాన్‌లో సూఫీ మత గురువు లాల్ షాబాజ్ ఖలందర్ ప్రార్థనా మందిరంలో చోటు చేసుకుంది. ఇక్కడ మానవ బాంబు జొరబడి చేసిన ఈ దాడిలో 80 మంది మరణించారు. మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!







