దుబాయ్‌లో కుటుంబాలకి ప్రైవేట్‌ బీచ్‌లు?

- February 21, 2017 , by Maagulf
దుబాయ్‌లో కుటుంబాలకి ప్రైవేట్‌ బీచ్‌లు?

కొన్ని ప్రైవేటు ప్రాంతాల్ని ఫ్యామిలీస్‌కి ఇచ్చేందుకు హయ్యర్‌ ప్యానల్‌ చర్చలు జరుపుతోంది. సాధ్యా సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిపిన తర్వాత ఈ అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు. జుమైరా ప్రాంతంతోపాటు పలు ప్రాంతాల్లోని బీచ్‌లలో కొంత భాగాన్ని స్విమ్మింగ్‌ కోసం కుటుంబాలకు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయి. బీచ్‌లలో అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌కి సంబంధించి కూడా సుప్రీం కమిటీ ఆఫ్‌ మెరిటైమ్‌ ఎఫైర్స్‌ - ఎమిరేట్‌ ఆఫ్‌ దుబాయ్‌ చర్చలు జరుపుతోంది. అలాగే ఫిషింగ్‌ బోట్స్‌, వెజెల్స్‌ నిబంధనలకు విరుద్ధంగా నడిపినట్లయితే వాటికి కఠినంగా జరీమానాలు విధించాల్సి ఉంటుందనీ, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం టోలరెన్స్‌ ఉండకూడదని అధికారులు అభిప్రాయపడ్డారు. సముద్ర కాలుష్యంపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెంచాలనీ, అదే సమయంలో డీజిల్‌ని నౌకల్లోకి పంపించే సమయంలో ఎలాంటి లీకేజీలకూ అవకాశమివ్వరాదని ఈ సందర్భంగా మేజర్‌ జనరల్‌ పైలట్‌ అహ్మద్‌ మొహమ్మద్‌ బిన్‌ థని అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com