పసిడి ధర పైపైకి..!

- February 21, 2017 , by Maagulf
పసిడి ధర పైపైకి..!

న్యూదిల్లీ: అంతర్జాతీయం పరిణామాలు, దేశీయంగా ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో పసిడి ధర పెరిగింది. 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.250 పెరిగి రూ.29,950కి చేరింది. మరోపక్క వెండిధర కూడా రూ.50 పెరగడంతో కేజీ రూ.43,200లకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల డిమాండ్‌ ఉండటంతో వెండి ధర పెరిగిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా 0.19శాతం పెరిగిన పసిడి ధర ఔన్సు 1,237 డాలర్లు పలికింది. వెండి ధర 0.42శాతం పెరిగి ఔన్సు 18.02డాలర్ల వద్ద ట్రేడ్‌ అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com