భారత్ ని తెగ పొగిడేస్తున్న చైనా..!
- February 21, 2017
భారత దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకు వెళుతుంది. భారత్ ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా భారత్ వైపు చూడటం మొదలు పెట్టాయి. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపై చైనాలో ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే వాణిజ్య ఉపగ్రహాలను అతితక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి పంపే విషయంలో భారత్ తమ కంటే ముందు ఉందని చైనా పేర్కొంది. భారత్ ను స్ఫూర్తిగా తీసుకొని అంతకంటే వేగంగా ముందుకు వెళ్లాలని చైనా నిర్ణయించింది.
ఇప్పుడు భారత్ కూడా అగ్రదేశాలతో పోటీ పడుతోందని షాంఘై ఇంజినీరింగ్ సెంటర్ ఫర్ మైక్రోశాటిలైట్స్ డైరెక్టర్ జాంగ్ యోంగే చెప్పారు.
ఎప్పుడూ భారత్ పై కస్సుబుస్సులాడే చైనా తొలిసారి భారత్‌పై ప్రశంసలు కురింపించింది. ఇస్రో చేసిన అద్భుత ప్రయోగంపట్ల అక్కడి మీడియా భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది.
చైనా కంటే ముందుగా అంగారకగ్రహం మీదికి ఉపగ్రహాన్ని పంపిన భారత్ ఇప్పుడు సింగిల్ రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను పంపించి మంచి అవకాశాన్ని సాధించిందని జాంగ్ తెలిపారు. భారత్ గత బుధవారం సాధించిన ప్రయోగం అంతరిక్ష కార్యక్రమాల్లో దాని తాజా విజయంగానే చెప్పాలని అంగీకరించారు. 2014లో అంగారక గ్రహంపైకి ఉపగ్రహ వాహకనౌకను దిగ్విజయంగా పంపిన భారత్ ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా చరిత్రకెక్కింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







