వరదలో మునిగిపోయిన బాధితుని మృతదేహం 9 కిలోమీటర్ల దిగువ ప్రాంతంలో లభ్యం
- February 21, 2017
జెడ్డా : ఇటీవల అకస్మాత్తుగా విరుచుకుపడిన వరదలలో కారులో ప్రయాణిస్తున్న ఓ దురదృష్టవంతుడు తన వాహనంతో సహా నీటి ప్రవాహంలో అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయాడు. గత వారం అల్ మంసక్ జిల్లాలో వరదలు ఉదృతంగా రహదారిపై ప్రవహిస్తున్న వేళ కారుతో సహా రోడ్డు ఆ దరికి చేరుకోవాలనే ఆదుర్దా ఆ వ్యక్తిని అర్ధాయుష్కుడిని చేసింది. నెమ్మది నెమ్మదిగా వరద నీటిలో జారిపోయిన వాహనంతో సహా దూరంగా కొట్టుకుపోయాడు. నీట మునిగిన ప్రాంతం నుంచి 9 కిలోమీటర్ల దిగువ ప్రాంతంకు నీటిలో దొర్లుతూ పోయి ఒక చిన్ని నీటి కుంటలో తన ఆఖరి మజిలీగా నిలిచిపోయాడు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత కాగా కుళ్ళిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి మృతదేహాన్ని అభ పౌర రక్షణ సిబ్బంది మరియు స్వచ్ఛంద కార్యకర్తలు తమ అన్వేషణలో కనుగొన్నట్లు యాసిర్ ప్రాంతం పౌర రక్షణ శాఖ డైరెక్టరేట్ పౌర రక్షణ ప్రతినిధి కల్నల్ మహ్మద్ రహీం సోమవారం తెలిపారు. తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం పౌర రక్షణ రక్షకులతో పాటు, ఇతర వాలంటీర్లతో మృతుని బంధువులు నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి శరీరం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమీపంలోని మాగాణి చెరువులు మరియు బావులని తీవ్రంగా వెతికేరు.ఆరు రోజుల తర్వాత వారికి ఆ స్థితిలో బాధిత వ్యక్తి మృతదేహం చూడటంతో అందరి హృదయాలు బరువెక్కేయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







