63 ఏళ్ళ వయస్సు అమ్మమ్మ అమ్మ అయింది !!
- February 21, 2017దుబాయి:ముగ్గుబుట్ట లాంటి తలతో ఉన్న బామ్మగారు ఓ ముద్దుల బిడ్డకు జన్మ నిచ్చింది. ముచ్చెమటలు పెట్టె ఈ వింతకు కారణమైన తాత గారిది మాత్రం మన భారతదేశంలోని చెన్నై నగరం కాగా...మామ్మగారి స్వదేశం శ్రీలంక.. దుబాయిలోని తుంబే హాస్పిటల్లో 63 ఏళ్ల ఓ మహిళ.. ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రపంచంలోనే అరుదైన సంఘటన ఒకటి సోమవారం యూఏఈ లో జరిగింది. యూఏఈకి వలస వెళ్లి దుబాయిలో ఉంటున్న ఓ భారతీయ కుటుంబం ఈ వింతకు కారణమయింది. భార్యది శ్రీలంక కాగా.. భర్త స్వస్థలం భారత్‌లోని చెన్నై నగరం. పూర్తి పేర్లు, ఇతర వివరాలు చెప్పడానికి ఆ భార్యాభర్తలు నిరాకరించినట్లు వైద్యులు పేర్కొన్నారు. తాను ఇంతవరకూ ఇలాంటి కేసును ఎప్పుడూ ఎదుర్కోలేదని 60 ఏళ్లు దాటిన మహిళ గర్భం దాల్చడం, పూర్తి ఆరోగ్యంగా బిడ్డకు జన్మనివ్వడం నా వైద్య జీవితంలో మర్చిపోలేనని కాన్పు చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ జాగౌడ్ నిర్మల తెలిపారు. ఈ వయస్సులో పూర్తి ఆరోగ్యంగా ఉన్న పాప తమకు పుట్టడం ఎంతో ఆనందాన్నిస్తోందని భార్యాభర్తలిద్దరూ చెప్పారు. గతంలోనే తనకు ఓసారి పెళ్లయిందనీ, అయితే అనుకోని కారణాల వల్ల భర్త నుంచి విడిపోయాననీ, ఆనాడు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవాళ్లయ్యారని చెప్పిందామె. భర్త నుంచి విడిపోయిన 13 ఏళ్ల తర్వాత రస్ అల్ ఖైమాలో పనిచేస్తున్న భారతీయ వ్యక్తితో పరిచయం అయ్యాడని తెలిపింది. ఇద్దరం పరస్పరం అర్థం చేసుకున్న తర్వాత పెళ్లిచేసుకున్నామని వివరించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









