ఫాన్సీ నెంబర్ ప్లేట్ల విషయమై షికార్లు కొడుతున్న పుకార్లు.. ఖండించిన ట్రాఫిక్ విభాగం

- February 21, 2017 , by Maagulf
ఫాన్సీ నెంబర్ ప్లేట్ల విషయమై షికార్లు కొడుతున్న పుకార్లు.. ఖండించిన ట్రాఫిక్ విభాగం

'నిజం చెప్పులు ..తొడుక్కొనే లోపున ..అబద్ధం ప్రపంచం చుట్టివస్తుందని ' కతర్  ట్రాఫిక్ విభాగం వాపోతుంది. ఒక కొత్త వర్ణమాల కతర్ కారు నెంబర్ ప్లేట్లకు జతచేయబడిందని అది తాజా వార్తగా సూచిస్తూ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో సాక్షీగా పుకార్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులు అవి నమ్మవద్దని మొర్రో అంటూ ట్రాఫిక్ విభాగం ఖండిస్తోంది. ఒక రేంజ్ రోవర్ వాహన నెంబర్ ప్లేట్ పై ' క్యూ " తో మొదలయ్యే ఒక వీడియో సామాజిక మీడియా లో విపరీతంగా ప్రాచుర్యం పొందుతుంది.

కతర్ వాహనం సంఖ్య ప్లేట్లు లో ఎటువంటి మార్పు లేదని సోమవారం ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తమ  ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ట్రాఫిక్ విభాగ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ సాద్ అల్ ఖర్జీ మాట్లాడుతూ,సోషల్ మీడియాలో ప్రచారం కాబడుతున్న వీడియోలోచూపిన రేంజ్ రోవర్ కారు ఆ నంబర్ ప్లేట్ ప్రత్యేకంగా టీవీ కార్యక్రమం కోసం రూపొందించేంచబడిందని అది త్వరలో ప్రసారం కాబడుతుందని చెబుతూ , ఆ వీడియో క్లిప్ ని చూపి తమ శాఖలో మార్పుగా అభివర్ణించడం సరికాదన్నారు. ఇదేదో నిజమనుకొని అనుమతి లేకుండా వాహనం సంఖ్య ప్లేట్లు ఎవరైనా మార్చుకున్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఆయన ఈ సందర్భంగా పుకార్లని వ్యాప్తి చేసేవారిని ఆయన  హెచ్చరించించారు. ట్రాఫిక్ చట్టం ఆర్టికల్ 13  ప్రకారం వాహన  రంగు, ఆకారం , నెంబర్ ప్లేట్లు ఏ మార్పు చేయడానికి అనుమతి లేదని, డైరెక్టరేట్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com