హెచ్1 బి వీసాలపై స్పందించిన ప్రధాని మోదీ
- February 21, 2017
నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులను తమ దేశంలోకి అనుమతించే విషయంలో కాస్త విశాల హృదయంతో ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాను కోరారు. 'అమెరికా ఫస్ట్' అన్న డోనాల్డ్ ట్రంప్ విధానాలు, హెచ్1బి వీసాల సంఖ్యపై వేటు.. తదితర పరిణామాల నేపథ్యంలో మోదీ ఈ అంశంపై స్పందించారు. హెచ్1బి వీసాలను తగ్గిస్తే.. 150 బిలియన్ డాలర్ల భారత ఐటీ సేవల పరిశ్రమపై ప్రభావం తీవ్రంగా పడుతుంది. ప్రధానంగా అమెరికాకు సాఫ్ట్‌వేర్ ఎగుమతుల మీదే ఈ పరిశ్రమ ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని పరిపుష్ఠం చేయడంలో నిపుణులైన భారతీయుల పాత్రను మోదీ ప్రస్తావించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా కాంగ్రెస్ నుంచి వచ్చిన 26 మంది సభ్యుల బృందాన్ని కలిసిన సందర్భంగా మోదీ ఈ విషయం వారికి తెలిపారు. సమతుల్యతతో కూడిన, దూరదృష్టి కలిగిన కోణంలో వృత్తినిపుణుల విషయంలో ఆలోచించాలని ప్రధాని కోరినట్లు పీఎంఓ తెలిపింది.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







