రెండు రాష్ట్రాల ప్రజలను శ్రీవారు చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు
- February 21, 2017
తిరుపతి: తిరుమల శ్రీవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మొక్కులు సమర్పించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులు బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఛైర్మన్, అధికారులు తమ కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులకు శ్రీవారం దర్శనం బాగా చేయించారని చెప్పారు. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, సంతోషమని శుభాకాంక్షలు తెలిపారు.
రెండు రాష్ట్రాల ప్రజలను శ్రీవారు చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
ఇరు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగుతాయని అన్నారు.
హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించగా.. శ్రీవారికి ప్రాంతాలుండవని, శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని చెప్పారు.
ధర్మ ప్రచారానికి టీటీడీతో కలిసి ముందుకు సాగుతామని కేసీఆర్ తెలిపారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







