మరో ఐదేళ్లలో సింగం-4 చిత్ర దర్శకత్వం చేపట్టనున్నట్లు హరి తెలిపారు
- February 21, 2017
టీనగర్: మరో ఐదేళ్లలో సింగం-4 చిత్ర దర్శకత్వం చేపట్టనున్నట్లు హరి తెలిపారు. ఇటీవల ఆయన ఒక చిత్ర విజయోత్సవంలో ఈ వివరాలు వెల్లడించారు. హరి దర్శకత్వంలో సూర్య నటించిన సింగం చిత్రం 2010లో విడుదలైంది. 2013లో సింగం-2, 2017లో సింగం-3 రిలీజై ప్రదర్శించబడుతున్నాయి. ఊహించిన విధంగానే వీటికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తర్వాత సింగం-4 ఎప్పుడు విడుదలవుతుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. దీనికి సమాధానమిచ్చే విధంగా ఇటీవల సింగం-3 తెలుగు చిత్ర విజయోత్సవంలో హరి వివరాలు వెల్లడించారు.
మరోఐదు లేదా ఆరేళ్లలో సింగం చిత్రం నాలుగో భాగాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విక్రమ్ నటించిన సామి చిత్రం రెండవ భాగానికి దర్శకత్వం వహిస్తానని, ఈ చిత్రం ముగియగానే మళ్లీ సూర్య నటించే మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తానని అన్నారు.
ఈ రెండు చిత్రాల్లో పాత్రలు ఎంతో భిన్నంగా ఉంటాయని తెలిపారు. హరి చేసిన ఈ ప్రకటనతో సామి-2, సూర్య నటించే చిత్రం కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







