'పిశాచి-2' ప్రచార చిత్రం విడుదల!!
- February 21, 2017
స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2". డేంజర్ జోన్ అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు.
ఈ చిత్రం ట్రైలర్స్ ను ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, మల్కాపురం శివకుమార్ విడుదల చేసారు. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సొంతం చేసుకోవాలని వారు అభిలషించారు. ఇకనుంచి తమ స్వర్ణభారతి క్రియేషన్స్ నుంచి రెగ్యులర్ గా సినిమాలు తీస్తామని నిర్మాత సాయి వెంకట్ తెలిపారు. ఆర్.జె.రూపేష్ శెట్టి-రమ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి.. కెమెరా: వీనస్ మూర్తి, సంగీతం: సతీష్ ఆర్యన్, నిర్మాత: లయన్ సాయి వెంకట్, దర్శకత్వం: దేవరాజ్ కుమార్ !!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







