ఐటీ కళ నవ్యాంధ్ర రాజధానికి
- February 21, 2017
నవ్యాంధ్ర రాజధానికి ఐటీ కళ వచ్చింది. ఇన్నాళ్ళు విశాఖకే పరిమితమైన ఐటి కంపెనీలు ఇప్పుడు విజయవాడకు క్యూ కడుతున్నాయి. ఇటీవల 8 కంపెనీలకు సీఎం రిబ్బన్ కటింగ్ చేశారు. ఇలా రెండేళ్లలో దాదాపు వందకు పైగా ఐటీ కంపెనీలు ఏపీ రాజధానికి క్యూ కట్టనున్నాయి. అమెరికా ఐటీ సెక్టార్లో చక్రం తిప్పుతున్న తెలుగువాళ్లు..ఇప్పుడు ఘర్ వాపసీ అంటూ ఏపీలో కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. హైదరాబాదును ఏవిధంగా సైబరాబాదుగా మార్చారో ఇప్పుడు విజయవాడను కూడా ఐటీ హబ్ గా మార్చేందుకు అడుగులు వేస్తున్నారు. ఇటీవల విజయవాడ ఆటోనగర్లో 8ఐటీ కంపెనీలకు రిబ్బన్ కటింగ్ చేశారు ఏపి సిఎం చంద్రబాబు. ఐటీ కంపెనీల కోసం ఇప్పటికే విజయవాడతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న భారీ భవనాలను గుర్తించారు. గన్నవరంలోని మేధా టవర్స్ లో వందకుపైగా ఐటీ కంపెనీలకు రంగం సిద్దమైంది. దీంతో పాటు మంగళగిరిలో భారీ ఐటీ పార్కులకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వేలాది మందికి ఉద్యోగావకశాలు లభించనున్నాయి. ఇలా రెండేళ్లలో దాదాపు వందకు పైగా ఐటీ కంపెనీలు ఏపీ రాజధానికి క్యూ కట్టనున్నాయి. రాష్ట్ర విభజన తరువాత విశాఖ, చిత్తూరు, విజయవాడ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల స్థాపనకు నాన్ రెసిడెంట్ తెలుగు సమాఖ్య క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చింది. వీటి నిర్వాహకులు వివిధ దేశాలు తిరుగుతూ అక్కడ ఉండే ప్రవాసాంధ్రులని ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేసేలా కృషి చేశారు. వీటిలో పేటియం, యాక్సెల్ ఐటీ, యం.యస్.ఆర్ కాశ్మో, అడాప్ టాలెంట్ సొల్యూషన్, అడ్వాన్స్ సాప్ట్, జోల్ట్ టెక్నాలజీ, డామియన్ కన్సెల్టింగ్ కంపెనీలు బెజవాడలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ తరహాలో విజయవాడను కూడా ఐటీకి కేంద్ర బిందువుగా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపధ్యంలో త్వరలో ఇది మహావృక్షంగా మారుతుందంటున్నారు ఐటీ మంత్రి పల్లెరఘునాధ్ రెడ్డి. ఏపి రాజధానికి ఐటీ సొబుగులు అద్దడంతో మిగిలిన కంపెనీలు భారీగా తరలివస్తాయంటున్నారు. ఏపీ ప్రభుత్వ చొరవతో ఇప్పటికే విశాఖలో 9 కంపెనీలు, విజయవాడలో 8 కంపెనీలు ఏర్పాటయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు వచ్చి వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







