లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వ్యక్తికి డబుల్ జరిమానా
- February 22, 2017
దోహా : ఒకరి నిర్లక్ష్యం మరొకరి పాలిట శాపం కారాదు అని దోహా నేర న్యాయస్థానం లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన ఓ ట్యునీషియా వ్యక్తికి రెండు రకాల భారీ జరిమానాలు విధించింది. నిందితుడు చెల్లుబాటులో లేని కతర్ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనం నడిపి మరొక వ్యక్తి గాయపడటానికి కారణమయ్యాడు. దీనితో దోహా క్రిమినల్ కోర్ట్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 3,000 కతర్ రియాళ్ళు, మరొక వ్యక్తి తీవ్రంగా గాయాలపాలవ్వడానికి కాణమయ్యాడని అందుకు అదనంగా మరో 3,000 కతర్ రియాళ్ళు జరిమాన విధించారు. ప్రతివాది గాయ పరిహారాన్ని చెల్లించేందుకు వాహన బీమా సంస్థ సహకారంతో 4,000 కతర్ రియాళ్ళు చెల్లించడానికి అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది .ప్రతివాది సల్వా రోడ్డు మీద ఒక చెల్లుబాటు కానీ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనం నడపడమే కాక నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కారణంగా ఒక మోటూరిస్టు గాయపడ్డారు. మరొక వాహనం ని ఢీ కొట్టాడు. పరిశోధనల అనంతరం నిందితుడు తాను నడుపుతున్న వాహనాన్ని సరైన దారిలో నడపడంలో విఫలమయ్యాడని అలాగే నిందితునికి ఒక కాలపరిమితి దాటిపోయిన కతర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కల్గి ఉన్నట్లు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







