ఇటలీ పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం పేపర్బాంబు పేలింది
- February 22, 2017
రోమ్: ఇటలీ పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం పేపర్బాంబు పేలింది. గత కొద్ది రోజులుగా అక్కడి ట్యాక్సీల డ్రైవర్లు యాప్ బేస్డ్ సర్వీసులైన ఉబెర్ తదితర సంస్ధలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాప్ బేస్డ్ సంస్ధలపై రెగ్యులేషన్ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని అక్కడి ప్రభుత్వం గతంలో చెప్పింది. హామీని వెంటనే నెరవేర్చాలని ఆరు రోజులుగా అక్కడి డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం నిరసనకారులతో ఇటలీ రవాణా శాఖ మంత్రి చర్చించాల్సివుండగా అంతకు కొద్దిసేపటి ముందే పేపర్ బాంబు పేలింది. దీంతో నిరసనకారుల్లో కొంతమంది ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారున. ఇంతలో పోలీసులపై నిరసనకారులు గాజు సీసాలు విసిరారు.
స్ధానికంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లపై దాడి చేసి అక్కడి వస్తువులు ధ్వంసం చేశారు. పరిస్ధితి చేయి దాటకముందే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో షేర్ అవుతున్నాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణల్లో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా సాగుతున్న ట్యాక్సీల స్ట్రైక్ నుంచి గర్భిణీలకు, దేవాంగులకు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







