గాల్లో తేలిన విమానం నిద్రపోయిన పైలెట్...
- February 22, 2017
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కి చెందిన ఓ విమానం ఇటీవల జర్మనీ గగనతలంలో దారితప్పడంపై విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు నివేదిక తయారు చేశారు. విచారణలో తేలిందేంటంటే... 330 ప్రయాణికులున్న ఈ విమానంలో ఓ పైలెట్ గుర్రుపెట్టి నిద్రపోయాడు. మరో పైలట్ తన హెడ్‌సెట్‌ను తక్కువ ఫ్రీక్వెన్సీలో పెట్టుకోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి సూచనలు సరిగా అందుకోలేకపోయాడు. దీంతో ముంబైనుంచి లండన్ వెళుతున్న 9డబ్ల్యూ 118 విమానానికి సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఆ విమానం కంటే ముందు ప్రయాణిస్తున్న ఢిల్లీ-లండన్ విమానం (9డబ్ల్యూ 122) ద్వారా అధికారులు ఆ విమానానికి మార్గనిర్దేశం చేశారు.
జెర్మనీ ఏటీసీ నుంచి సమాచారం అందుకున్న ఢిల్లీ విమానం సిబ్బంది 118 విమానం నడుపుతున్న పైలెట్లను శాటిలైట్ ఫోన్ ద్వారా సంప్రదించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి 118 సిబ్బంది ముంబై ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరించుకోగలిగారు. దాదాపు 15 నిమిషాలకు గానీ పరిస్థితి చక్కబడలేదు. మొత్తం మీద 303 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడినందుకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







