3 లక్షల మంది ఎన్నారైలు ఇంటికే ట్రంప్ ఎఫెక్ట్
- February 22, 2017
వాషింగ్టన్
తగిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న దాదాపు కోటి మందికి పైగా వలసదారులను వాళ్ల వాళ్ల దేశాలకు తిప్పి పంపేయాలన్న ట్రంప్ నిర్ణయంతో దాదాపు 3 లక్షల మంది భారతీయ అమెరికన్లపై ప్రభావం పడుతుంది. తగిన పత్రాలు లేకుండా వలస వచ్చినవాళ్లపై వేటు వేసేందుకు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలును గణనీయంగా మారుస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నవాళ్లను ఏరి పారేయడంలో తమ శాఖ ఇక ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినట్లు తేలిన ఎవరినైనా అరెస్టు చేయడానికి లేదా అదుపులోకి తీసుకోడానికి తమ శాఖ సిబ్బందికి పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పింది.
ఇప్పటికే డీహెచ్ఎస్ రెండు ఎన్ఫోర్స్మెంట్ మెమోలను జారీచేసింది. వాటి ప్రకారం అక్రమ వలసదారులను వెంటనే తమ దేశాలకు పంపించేందుకు వీలుంటుంది. ప్రధానంగా నేరస్తుల మీదే ఇది దృష్టిపెడుతున్నా, ఇతరులకూ వర్తిస్తుంది.
దాదాపు 3 లక్షల మంది వరకు భారతీయులు ఇలా తగిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. వీళ్లందరికీ కూడా ఈ కొత్త నిబంధనలతో ముప్పు తప్పదు. వాళ్లంతా వెనక్కి తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మైనర్లు గానీ, ఆశ్రయం పొందిన వారు గానీ, లేదా సొంత దేశంలో ఏవైనా చిత్రహింసలు అనుభవిస్తామన్న భయంతో ఉంటున్నవాళ్లు.. ఇలాంటి వాళ్లకు మాత్రం కొంతవరకు మినహాయింపు లభిస్తుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







