ఆహార చట్టం ఉల్లంఘించినవారిపై తక్షణ జరిమానా మరియు మూసివేత ప్రకతన
- February 22, 2017
జెడ్డా : ప్లాస్టిక్ సంచులలో వేడి ఆహారం ఇవ్వడం, సురక్షితం కానీ కంటైనర్లలలో పదార్ధాల దాచేందుకు ఉపయోగించరాదని అన్ని ఆహార దుకాణాలు, రెస్టారెంట్లు మరియు బేకరీలకు జెడ్డా మున్సిపాలిటీ హెచ్చరించింది. వీటిని అతిక్రమించిన వ్యాపాస్తులకు తక్షణ జరిమానాలు మరియు చట్టం ఉల్లఘించిన కారణంగా దుకాణాలను మూసివేత చర్యలు చేపడతామని ఆదివారం పురపాలక శాఖ ప్రకటించింది.ఈ మార్గ దర్శకాలను అనుసరించడానికి అన్ని దుకాణాలకు ఆఖరి గడువు ఫిబ్రవరి 28 వ తేదీ వరకు ఉంది. ఉప మున్సిపాలిటీల్లో అసిస్టెంట్ సెక్రటరీ మహమ్మద్ నసీర్ అల్ మతాబ్ మాట్లాడుతూ , జెడ్డా మున్సిపాలిటీ తమ ఆహార భద్రత మరియు భద్రతా కార్యక్రమం కింద నిబంధనలను పాటించని అనేక ఆహార దుకాణాలు మరియు రెస్టారెంట్లను ఇప్పటికే అధిక సంఖ్యలో మూసివేసినట్లు తెలిపారు. జెడ్డాలోని దుకాణాలు, రెస్టారెంట్లు, బేకరీలు ఇకపై వేడి ఆహారం కోసం ప్లాస్టిక్ సంచులను మరియు కంటైనర్లు ఉపయోగించరాదని ఆయా దుకాణ నిర్వాహుకులకు ఒక సలహా ఇచ్చినట్లు చెప్పారు.తన పరీశీలనలో బేకరీ యాజమాన్యం మైక్రో ఓవెన్లు నుండి వేడి బ్రెడ్ తీసుకుని కన్వేయర్ బెల్ట్ దగ్గరగా వచ్చిన వాటిని హడావిడిగా ప్యాకింగ్ చేస్తున్నారని, ప్యాక్ చేసే ముందు బ్రెడ్లను చల్లబరచడం ఆరోగ్యరీత్యా ఎంతో మంచిదని చెప్పారు. ఈ ఆహార భద్రత మరియు భద్రతా కార్యక్రమంని నివాసితులు మరియు జెడ్డా సందర్శకుల కోసం ఆహార భద్రత మరియు నాణ్యత మెరుగు దాదాపు ఒక సంవత్సరం క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమమే విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!







