కువైట్‌లో భారతీయ మహిళా నర్సుకి కత్తిపోట్లు దోపిడీ దొంగల ఘాతుకం
- February 22, 2017
కువైట్: నైట్ డ్యూటీ ముగించుకొని వెళుతున్న 27 ఏళ్ళ ఒక భారతీయ నర్సు పై కొందరు గుర్తు తెలియని దుండగులు ఆకస్మికంగా దాడి చేశారు. మంగళవారం ఉదయం 8 : 30 సమయంలో జెలీబ్ ఆల్ షోయోముఖ్ ప్రాంతంలో తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ రెండవ ఫ్లోర్ ని దాటి వెళుతుండగా కొందరు దుండుగులు కత్తితో ఆమెపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆమె మొఖంపై , పొట్ట పై ,తొడలపై దారుణంగా పొడిచి ఆమె వద్ద ఉన్న డబ్బును,నగలను దోచుకెళ్లారు. రక్తమోడుతున్న ఆమె దిగువ ఫ్లోర్ కు తూలుతూ వచ్చి తనపై దాడి జరిగినట్లు తెలియచేయడంతో అందరు అప్రమత్తమై పోలీసులను ..అంబులెన్సును అక్కడకి పిలిచేరు.. వెనువెంటనే ఆమెకు శస్త్రచికిత్స జరగడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కువైట్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానిక ఎన్నారైల్లో భయాందోళనలు రేకెత్తించింది. అబ్బాసియా ప్రాంతంలోని జహ్రా ఆసుపత్రిలో నర్సుగా గత కొంతకాలంగా పనిచేస్తున్న గోపికా శివాజీకుమార్ కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందినది.. మంగళవారం విధులు ముగించుకుని తన ఫ్లాట్ లోనికి వెళుతుండగా.. కొందరు దుండగులు ఆమెను అడ్డుకుని డబ్బు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆమె భయపడి కేకలు పెట్టడంతో కత్తితో పలుమార్లు ఆమెను పొడిచి... ఆమె వద్ద ఉన్న బ్యాగు, నగలను దోచుకుని పారిపోయారు. కాగా.. గోపిక పరిస్థితి ప్రస్తుతం ఫరవాలేదనీ, తొందర్లోనే కోలుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల కువైట్‌లోని జెలీబ్ ఆల్ షోయోముఖ్ ప్రాంతంలో భారతీయులు, విదేశీయులపై దోపిడీ దొంగల దాడులు పెరిగిపోతున్నాయి. కొందరు ఎన్నారైలు పోలీసులతో మాట్లాడి సెక్యూరిటీని ఎర్పాటు చేయించుకుంటున్నా ఈ దాడులు ఆగడం లేదు. దోపిడీ దొంగలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు అధికారులు మార్గాలు అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







