పిల్లో చీటింగ్‌: ఆరు నెలల జైలు

- February 22, 2017 , by Maagulf
పిల్లో చీటింగ్‌: ఆరు నెలల జైలు

బురైమి: కొత్త పిల్లోస్‌ని పాత క్లాత్స్‌తో తయారు చేసి, వాటిని విక్రయిస్తున్న వ్యక్తికి బురైమి కోర్ట్‌ 2000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానాతోపాటు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. గార్బేజ్‌ డంప్స్‌ నుంచి సేకరించిన పాత స్పాంజ్‌, అలాగే పాత క్లాత్స్‌ని ఉపయోగించి కొత్తగా పిల్లోస్‌ తయారు చేసి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నాడు నిందితుడు. ఓ వినియోగదారుడు ఈ మోసాన్ని గ్రహించి పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మూడు ప్యాకింగ్‌ మెషీన్లు, 216 పిల్లోస్‌, 294 అరబిక్‌ పిల్లోస్‌, అలాగే పాత స్పాంజ్‌, ఓల్డ్‌ క్లాత్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. విచారణ అనంతరం పోలీసులు నిందితుడ్ని న్యాయస్థానం యెదుట హాజరు పర్చగా, ఈ కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరీమానా విధించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com