లాహోర్ మిలిటరీ ఏరియాలో పేలుడు, 8మంది మృతి
- February 23, 2017
పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. లాహోర్‌లోని మిలిటరీ ఏరియాలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పేలుడుకు కారణాలు తెలియరాలేదు. కాగా, జనరేటర్ బ్లాస్ట్ కావడం వల్ల పేలుడు జరిగినట్లు స్థానిక పంజాబ్ ప్రభుత్వం ట్విట్టర్లో పేర్కొంది. రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఫెన్స్ ఏరియలో ఉన్న ఓ రెస్టారెంట్లో పేలుడు జరిగినట్లు తెలిపారు. దాని వల్ల సమీపంలో ఉన్న భవనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన 15 మందిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ప్రాంతాన్ని భారీగా పోలీసులు చుట్టుముట్టారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







