మోసుల్ విమానాశ్రయాన్ని కైవసం చేసుకున్న ఇరాకీ దళాలు
- February 23, 2017
ఫెడరల్ పోలీస్, హోం మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత ర్యాపిడ్ రెస్పాన్స్ దళాలు విమానాశ్రయంవైపు దూసుకెళ్ళాయి. భారీ ఎత్తున మోర్టార్లను కుమ్మరించాయి. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు దారి చూపుతూండగా నేలపై నుంచి సైనిక దళాలు చొచ్చుకెళ్ళాయి. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వైమానిక దాడులతో ఇరాకీ దళాలకు మద్దతుగా నిలిచాయి. అమెరికా, ఇరాక్ దళాలు కలిసికట్టుగా సాయుధ వాహనాల్లో విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు దూసుకెళ్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ఆ విమానాశ్రయం మోసుల్‌కు దక్షిణ దిశలో ఉంది. ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విమానాల రాకపోకలు ఆగిపోయాయి.
ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడియర్ జనరల్ అబ్బాస్ అల్ జుబూరీ మాట్లాడుతూ దేవుని దయతో ఈ రోజు (గురువారం) విమానాశ్రయంలోకి ప్రవేశిస్తామన్నారు. ఇరాక్‌లో జీహాదీల ప్రాబల్యంలో ఉన్న చిట్టచివరి నగరం మోసుల్. ఈ నగరంపై పట్టు సాధించేందుకు భద్రతా దళాలు వేలాదిగా ఆదివారం ఇక్కడికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







