కొత్త సౌరకుటుంబాన్ని కనుగొన్న నాసా
- February 23, 2017
విశ్వంలో మరో అద్భుతాన్ని కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. సుదూర సౌరకుటుంబంలో భూమిని పోలిన ఏడు గ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. ట్రాపిస్ట్-1 అనే నక్షత్రం చుట్టూ ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఖగోళ ఆవిష్కరణల్లో ఇలాంటి అంశాలను గుర్తించలేదన్నారు. భూగ్రహం కాకుండా సౌరకుటుంబంలో ఉన్న ఇతర గ్రహాల్లో గ్రహాంతరజీవులు ఉన్నరా? లేదా? అనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుంది.
ఇదో అద్భుతం
ఈ గ్రహ కూటమి సుమారు 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుత ఆవిష్కరణకు సంబంధించిన నివేదికను నేచర్ జర్నల్ లో కూడా ప్రచురించారు. ఒకే నక్షత్రం చుట్టూ టెరస్ట్రియల్ గ్రహాలు భ్రమణం చేస్తున్న తీరును ఖగోళ శాస్త్రవేత్తలు ఒక అద్భుతంగా భావిస్తున్నారు.
మన సౌరకుటుంబం మాదిరిగానే
కొత్త సౌరకుటుంబం స్వల్ప తేడాతో మన సౌరకుటుంబం తరహాలోనే ఉండవచ్చనేది శాస్త్రవేత్తల అంచనా. ట్రాపిస్ట్ నక్షత్రం ఆ గ్రహాల మధ్యలో ఉందన్నారు. ఇది సూర్యుడిలో పదో వంతు ఉందని వారి అంచనా.
ఈ నక్షత్రం కూల్ గా ఉన్న కారణంగా, దాని చుట్టూ తిరిగే గ్రహాల్లో వెచ్చని నీరు ఉండొచ్చని భావిస్తున్నారు. భూమి, శుక్రుడు, అంగారక గ్రహాలకు సూర్యుడి నుంచి అందుతున్న వేడి తరహాలోనే ట్రాపిస్ట్ దగ్గర ఉన్న గ్రహాలకు కూడా హీట్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణం వల్ల ఆ గ్రహాలు జీవానికి అనుకూలంగా ఉంటాయనేది వీరి భావన.
మూడు గ్రహాలు నివాసయోగ్యం?
ట్రాపిస్ట్ నక్షత్రం సమీపంలో ఉన్న మూడు గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహ ఉపరితలంపై నీటి ఛాయలు కూడా ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు.
జీవం ఆనవాళ్లు కూడా ఉండొచ్చు
అంతేకాదు, నక్షత్రానికి సమీపంగా ఉండడం వల్ల ఈ గ్రహాల్లో ఏదో ఒకదానిపై జీవానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బెల్జియంలోని యూనివర్సటీ ఆఫ్ లీగ్ కు సంబంధించిన ఎక్సోప్లానెట్ పరిశోధకుడు మైఖేల్ గిల్లాన్ తన నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించారు.
విశ్వంపై ఉన్న అవగాహనలను మరింత అధ్యయనం చేసేందుకు ఏడు గ్రహాల ఆవిష్కరణ ఉపయోగపడుతుందని మైఖేల్ గిల్లాన్ పేర్కొన్నారు. ఒకవేళ ఆ గ్రహాలపై నీరు ఉన్నా, లేకున్నా, అధ్యయనంలో ఏది బయటపడినా అది ఆసక్తికరంగానే ఉంటుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







