చిరు, పవన్‌లతో మల్టీస్టారర్ సినిమాని ఖాయంచేసిన టీఎస్ఆర్
- February 23, 2017
మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్లు నిర్మాత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదని ఇటీవల గుసగుసలు వినిపించాయి. కానీ వారితో మల్టీస్టారర్ సినిమా తీసేందుకు కథ సిద్ధమవుతోందని, ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాతగా ఉంటారని గురువారం సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంపై అభిమానుల్లో సహజంగానే ఎక్కువగా అంచనాలు ఉంటాయని, అందుకనుగుణంగానే కథను సిద్ధం చేస్తున్నామన్నారు.
సాగరతీరంలో మహా కుంభాభిషేకం
మహాశివరాత్రి సందర్భంగా విశాఖ సాగరతీరంలో లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి శివలింగ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సాగరతీరంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పెందుర్తి శారదాపీఠం స్వామి స్వరూపానంద సరస్వతి, పలువురు మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







