అమరావతికి రానున్న టెక్ దిగ్గజం హెచ్ సీఎల్
- February 23, 2017
దేశంలోనే నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేస్తోంది. తన అతిపెద్ద డెవలప్ మెంట్ సెంటర్లలో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలని ప్లాన్స్ వేస్తోంది. దీని కింద మొత్తం రూ.1000 కోట్ల పెట్టుబడులను హెచ్ సీఎల్ టెక్ పెట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఈ విషయంపై ఓ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటి అమరావతిలో దీన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఓ ఐటీ దిగ్గజం పెట్టబోతున్న అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ ఇదే.అయితే ఈ వార్తలపై హెచ్ సీఎల్ టెక్నాలజీస్ స్పందించడం లేదు. ఈ డెవలప్ మెంట్ సెంటర్ కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా భూములు కావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







