హనురాఘవపూడితో కొత్త సినిమాకు ఓకే చెప్పిన నాని
- February 23, 2017
నాచురల్ స్టార్ 'నాని', దర్శకుడు 'హనురాఘవపూడి' ల కాంబినేషన్ లో మరో చిత్రం వరుసగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' ', 'జెంటిల్ మాన్', 'మజ్ను' 'నేను లోకల్ ' వంటి సినిమాలతో మంచి ఊపు మీదున్న నాని తన కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'నాని' హీరోగా తెరకెక్కి హిట్ టాక్ తెచ్చుకున్న 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' చిత్ర దర్శకుడు హను రాఘవపూడితో మరోసారి నాని సినిమా రూపొందుతోంది. హీరో నాని, తన కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుండటం సంతోషంగా ఉందని దర్శకుడు హను తెలిపారు.
ఈ చిత్రానికి సుప్రసిద్ధ సంగీత దర్శకుడు 'మణిశర్మ' సంగీతం అందిస్తుండగా, కెమెరామెన్‌గా 'యువరాజ్‌ను' (కృష్ణ గాడి వీరప్రేమగాధ, ప్రస్తుతం హీరో నితిన్, హనురాఘవపూడిల సినిమాల కెమెరామెన్) ఎంపిక చేశారు. చిత్రంలోని ఇతర నటీ,నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మీడియాకు తెలియజేస్తామని నిర్మాతలు చెప్పారు. 2017 ఆగస్టు నెలలో చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చిత్ర నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







