'నిన్ను కోరి' ఫస్ట్ లుక్
- February 23, 2017
నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య నానికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. మార్చి 10 వరకు అమెరికా షెడ్యూల్ వుంటుంది. తర్వాత వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. నేచురల్ స్టార్ నాని, నివేథా థామస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు.
మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్, నీతు, భూపాల్‌రాజ్, కేదార్‌శంకర్, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్ నేహంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సంగీతం: గోపీసుందర్, ఫోటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్: చిన్నా, స్టైలింగ్: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి, ప్రొడక్షన్ కంట్రోలర్: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







