విడుదలైన 'ఉంగరాల రాంబాబు' ఫస్ట్ లుక్
- February 23, 2017
ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. రథ సప్తమి సందర్బంగా ఈ చిత్ర ప్రచార రథాన్ని ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. మహా శివరాత్రి సందర్భంగా హీరో సునీల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు. నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి సెకండ్ వీక్ లో ఆడియో రిలీజ్ చేసి వేసవి కానుకగా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ " మా దర్శకులు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన రెండు చిత్రాలు హృదయాలకి హత్తుకునేలా వుంటాయి. ఆయన మార్క్ వుంటూనే, సునిల్ తరహా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఉంగరాల రాంబాబు చిత్రం ద్వారా అందించబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో తన క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. మహా శివరాత్రి సందర్భంగా హీరో సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాం. ఈ ఫస్ట్ లుక్ తో సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఇటీవలే సునీల్ పై ఎనర్జిటిక్ సాంగ్ చిత్రీకరించాం. మార్చి రెండో వారంలో చిత్ర ఆడియోను విడుదల చేసి.. సమ్మర్ కానుకగా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. " అని అన్నారు.
నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున
సాంకేతిక వర్గం
మ్యూజిక్ - జిబ్రాన్
లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్
సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్ - వెంకట్
డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ
ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్
కొరియో గ్రఫి - భాను మాస్టర్
పబ్లిసిటీ - ధని
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
బ్యానర్ - యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్
ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి
డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!







