3 లక్షలమంది ఎన్నారైలను వెనక్కి పంపేయనున్న అమెరికా ప్రభుత్వం
- February 23, 2017
అక్రమ వలసదారులను అడ్డుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు అక్కడున్న ఎన్నారైల్లో టెన్షన్ మొదలైంది. ఏ క్షణాన అధికారులు తమను భారత్‌కి పంపిస్తారేమోనన్న భయం వాళ్లను అనుక్షణం వెంటాడుతోంది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగేశారు. ఎంతమంది అక్రమంగా వుంటున్నారన్న దానిపై లెక్కలు తీస్తే వివిధ దేశాలకు చెందినవాళ్లు దాదాపు 11 మిలియన్ల మంది వున్నట్లు తేలింది. అందులో 3 లక్షలమంది ఇండో- అమెరికన్లు వున్నట్లు సమాచారం. వీళ్లందరిపైనా ఆ ప్రభావం పడనుంది. ఎన్నో ఏళ్లుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న తమను హఠాత్తుగా పొమ్మనడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వలసదారులను పంపించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గట్టిగా నిర్ణయించుకుంది. ఒకవేళ ఇమిగ్రెంట్ చట్టాలను ఉల్లంఘించినట్లు అధికారులు భావిస్తే వాళ్లని అరెస్టు చేసే అదుపులోకి తీసుకునే సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. మరోవైపు అమెరికా భద్రతా విభాగం ఇప్పటికే రెండు మెమోలను జారీ చేసింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







