యండమూరి సంచలన కామెంట్స్ చిరంజీవి ప్రోగ్రామ్‌పై
- February 23, 2017
ఒకప్పుడు చిరంజీవికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రచయిత యండమూరి వీరేంద్రనాథ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. మరి, ఆ తర్వాత ఏమైందో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో రామ్‌చరణ్‌ను ధూషిస్తూ యండమూరి చేసిన కామెంట్స్.. వారి మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఆ కామెంట్స్‌కు మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా సమాధానం చెప్పడం, దానిపై మళ్లీ యండమూరి స్పందించడం జరిగిపోయాయి. అయితే మరోసారి ఇండైరెక్ట్‌గా చిరంజీవిపై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టారు యండమూరి వీరేంద్రనాథ్. చిరు నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌పై యండమూరి సంచలన కామెంట్స్ చేశారు. ఆ ప్రోగ్రామ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
''మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్ పేరుతో ఘోరమైన మోసం జరుగుతోంది. ఆ షోలో పాల్గొనాలంటే ముందుగా మూడు మెసేజ్‌లు పంపాలి. ఒక్కో మెసేజ్‌కు ఐదు రూపాయలు ఖర్చవుతుంది. అంటే మూడు మెసేజ్‌లకు 15 రూపాయలు.
పది లక్షల మంది మేసేజ్‌లు పంపితే దాదాపు కోటిన్నర రూపాయలు నిర్వాహకుల జేబులో పడతాయి. తర్వాత ఐదు, ఆరు లక్షలు కుక్కలకు విసిరినట్లు విసురుతారు. వాటినే చొంగ కార్చుకుంటూ తీసుకుంటున్నాం. ఇంతకంటే హీనం మరొకటి ఉండదు.
చాలా పేదవాళ్లు కూడా ఇలాంటి వాటికి మెసేజ్‌లు పంపించి మోసపోతున్నారు. దీని కంటే లాటరీ టికెట్ కొనడం మేలు. లాటరీలను బ్యాన్ చేసిన ప్రభుత్వం ఇలాంటి గ్యాంబ్లింగ్ ప్రోగ్రామ్‌లను కూడా బ్యాన్ చేయాల'ని యండమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









