ఐసిస్ మరో దుశ్చర్య ఇరాక్‌లో
- February 24, 2017
బాగ్దాద్: మతాచారాలను ఇరాక్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఇద్దరు సైన్యాధికారులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవికంగా తలనరికి చంపారు. షియాల ఆధిపత్యమున్న కర్బాలా సిటీలో మంగళవారం బహిరంగంగా ఐసిస్ ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సైన్యాధికారులు అబ్బాస్ యాసిన్ హుస్సేన్, అలీ అల్-దరాజీల శిరచ్ఛేదన దృశ్యాలను వీడియో తీసి ఉగ్రవాదులు ఆన్లైన్లో పోస్టుచేశారని 'అరా న్యూస్' వార్తా వెబ్సైట్ వెల్లడించింది.
అమెరికా సహకారంతో దాడులుచేస్తున్న ఇరాక్ ప్రభుత్వబలగాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఐసిస్ ప్రకటించింది. దక్షిణ ఇరాక్‌లోని కర్బాలాలో ఇటీవల ఉగ్రవాదులపై సైనికదాడుల సమయంలో ఈ ఇద్దరు అధికారులు ఐసిస్‌కు చిక్కారు.
మరోవైపు, అబూ బకర్ అల్-సమురాయ్ పేరు గల సైన్యాధికారిని ఐసిస్ ఉగ్రవాదులు మెడకోసి చంపేసి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మృత్యువుకు దగ్గరవుతున్న చివరిక్షణంలోనూ భయంకనబడని సైన్యాధికారి వీడియో మీడియాలో హల్చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!







