టూరిజం బస్సుతో విస్తృత ప్రచారం
- February 26, 2017
పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన
బస్సులోనే సర్వ హంగులు
చారిత్రక, వారసత్వ కట్టడాల నిర్మాణాలపై వీడియోలు
ఆసక్తిగా చూస్తున్న పర్యాటక ప్రేమికులు
బస్సులో ఈజిప్ట్ మమ్మీని పోలిన నమూనా
పర్యాటక ప్రాంతాలపై గైడ్ సూచనలు
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ : తెలంగాణ పర్యాటక ప్రాధాన్యతను పెంచేందుకు టూరిజం అధికారులు బస్సుతో చేపట్టిన ప్రచారం పర్యాటక ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో తెలంగాణ మ్యూజియం ఆన్ వీల్స్ బస్సుతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ బస్సులో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల ఫొటోలు, చారిత్రక, వారసత్వ కట్టడాల చిత్రాలు పర్యాటక ప్రాంతాల వివరాలతో కూడిన బ్రోచర్లు, పర్యాటక ప్రాంతాల ప్రాధాన్యం తెలిపేలా వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ పర్యాటక ప్రేమికులను అలరిస్తున్నాయి. స్టేట్‌మ్యూజియంలో ఉన్న ఈజిప్ట్ మమ్మీ ని పోలిన నమూనాను బస్సులో ఏర్పాటు చేశారు. దీంతో నమూనా మమ్మీని చూడటానికి పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఈ బస్సులో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న.. టూరిజం ప్రాంతాలపై రూపొందించిన వీడియోలను సైతం పర్యాటకులకు చూపిస్తున్నారు. చార్మినార్, గోల్కొండ, ఎన్టీఆర్‌గార్డెన్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ఈ బస్సు చక్కర్లు కొడుతోంది. బస్సుపై ఉన్న పక్షులు, జంతువులు, చారిత్రక కట్టడాల చిత్రాలను వాహనాలపై వెళ్లేవాళ్లు సైతం ఆసక్తిగా చూస్తున్నారు. వివిధ ప్రాంతాలపై అవగాహన తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు.. టూరిజం గైడ్ సూచనలిస్తున్నారు. ఆయా ప్రాంతాల చరిత్ర వారికి వివరిస్త్తున్నారు. ప్యాకేజీల గురించి వివరిస్తున్నారు. డెయిలీ టూర్స్, వీకెండ్ టూర్, ఇంటర్‌స్టేట్ తదితర టూర్ల గురించి తెలియజేస్తున్నారు. వరంగల్‌లోని కాకతీయుల కళావైభవం, అద్భుతమైన చారిత్రక కోట, పాకాల చెరువు, నిజామాబాద్‌లోని మల్లారం అడవి, ఆర్కియాలాజికల్ మ్యూజియం, అప్పట్లో కుతుబ్‌షాహీలు, అస్‌ఫజాహీల ఆధీనంలో ఉన్న సంస్థానం దోమకొండ కోట, మెదక్‌లోని ఏడుపాయలు, సిద్ధిపేటలోని కోటిలింగేశ్వరస్వామి... ఇలా 31 జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాల చరిత్రపై సమగ్రంగా వివరిస్తున్నారు. ఫ త్వరలో ఇతర జిల్లాల్లో బస్సుతో ప్రచారం
హైదరాబాద్‌లో టూరిజం ప్రచారానికి విపరీతమైన స్పందన వస్తోంది. మరో రెండు వారాల్లో ఇతర జిల్లాల్లో కూడా ప్రచారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల టూరిజం అధికారులతో మాట్లాడారు. వేసవి సెలవులు రానుండటంతో ఇప్పటి నుంచే అధికారులు పర్యాటక ప్రేమికులను పెంచుకునేలా వివిధ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టాల్లో రోడ్డు షోలు నిర్వహించారు. తెలంగాణ పర్యాటకంపై అక్కడి టూర్ ఏజెన్సీలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎట్టకేలకు ఈ వేసవిలో పర్యాటకంపై భారీ ఆదాయం వచ్చేలా అధికారులు పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









