మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ రాష్ట్రపతి రేసులో
- February 26, 2017
కాబోయే భారత రాష్ట్రపతి ఎవరు? మురళీ మనోహర్ జోషా? సుష్మా స్వరాజా? ఇదే ఇప్పుడు హస్తినలో చక్కర్లు కొడుతున్న ప్రశ్న. రాష్ట్రపతి ప్రణబ్ పదవీకాలం జులైలో ముగుస్తుండడంతో.. కొత్త రాష్ట్రపతి ఎవరనే దానిపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జులైతో ముగుస్తుండడంతో.. కొత్త రాష్ట్రపతి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. రాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషి, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం కలిగి ఉన్న మురళి మనోహర్ జోషి.. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో 19 నెలల జైలు జీవితం గడిపారు. 1991లో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం తీవ్రంగా పోరాడిన జోషి.. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో 1992లో కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు ఏక్తా యాత్ర చేపట్టారు.
ఇక సుష్మాస్వరాజ్ మోడీ ప్రభుత్వంలో మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తోనే కాకుండా ఇతర రాజకీయ పార్టీలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండడం వంటి విషయాలు ఆమెకు ప్లస్ పాయింట్స్. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితులు ఏ మేరకు అనుకూలిస్తాయో వేచి చూడాలి. ప్రస్తుతం లోభసభ స్పీకర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుమిత్రా మహాజన్ కూడా రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు జార్ఖండ్ గవర్నర్, గిరిజన మహిళ ద్రౌపది ముర్ముల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ కురువృద్ధుడు అద్వానీ పేరు మాత్రం రాష్ట్రపతి పదవి కోసం చర్చకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశముంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







