శివుడి ఆశీస్సులతో ఆరంభం.. శివరాత్రికి పూర్తి
- February 27, 2017
''కీసరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో మా 'వైశాఖం' చిత్రీకరణ ప్రారంభమైంది. సరిగ్గా శివరాత్రికి చిత్రీకరణ పూర్తయింది'' అని నిర్మాత బీఏ రాజు అన్నారు. హరీష్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'వైశాఖం' పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
రాజు మాట్లాడుతూ- ''వైశాఖం' ఓవర్సీస్ రైట్స్‌ను బ్లూ స్కై సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌కు సొంతం చేసుకుంది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ ఏరియాల నుంచి బయ్యర్స్ చాలామంది వస్తున్నారు. స్పీడ్‌గా బిజినెస్ అవుతోంది'' అన్నారు. ''కథ ప్రకారం ఓ సన్నివేశంలో చండీయాగాన్ని శాస్త్రోక్తం గా జరిపించాం.
అలా శివుడి అనుగ్రహం ఉన్న మా సినిమా శివరాత్రికి పూర్తవడం విశేషం. మంచి ఫీల్‌గుడ్ మూవీ ఇది'' అని బి. జయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె. వసంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







