లులు ఫిల్స్ తొలి 24 గంటల బ్రాంచ్ ప్రారంభం
- February 28, 2017
మనామా: లులు ఫిల్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ 24 గంటల పాటు పనిచేసే ఔట్లెట్ని ప్రారంభించింది. లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ఎల్ఎల్సికి సంబంధించిన లులు ఫిల్స్, ఫిలిప్పీన్స్లో ఈ మూడవ బ్రాంచ్ని ప్రారంభిస్టున్నట్లు వెల్లడించింది. నినాయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ - మనీలాలోని టెర్మినల్ 1లో దీన్ని ప్రారంభించారు. ఇది లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్కి సంబంధించి 136వ బ్రాంచ్. లులు ఫిల్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రెసిడెంట్ మరియు చైర్మెన్ ఆఫ్ ది బోర్డ్ అదీబ్ అహ్మద్ ఈ బ్రాంచ్ని ప్రారంభించారు. ఆర్థిక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటని అదీబ్ అహ్మద్ చెప్పారు. 2014లో ఫిలిప్పీన్స్లోని మనీలాలో లులు ఫిల్స్ మెయిన్ బ్రాంచ్ని ప్రారంభించింది. తాజా బ్రాంచ్లో 24 గంటలపాటు పలు సేవలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







